Call Us On +91- 9246377055

News

8 నుంచి జేఈఈ దరఖాస్తుల్లో తప్పుల సవరణ

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్‌లో నిర్వహించనున్న రెండో విడత జేఈఈ మెయిన్స్‌కు సంబంధించిన సమాచార బులెటిన్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం విడుదల చేసింది. ఈ నెల 7 నుంచి దరఖాస్తుల స్వీకరణను చేపట్టిన ఎన్‌టీఏ మార్చి 6 వరకు విద్యార్థులు సబ్మిట్‌ చేయవచ్చని తెలిపింది. మార్చి 7 వరకు ఫీజు చెల్లించవచ్చని స్పష్టం చేసింది. దరఖాస్తుల్లో ఏమైనా పొరపాట్లు దొర్లితే మార్చి 8 నుంచి 12 వరకు ఆన్‌లైన్‌లో సరిదిద్దుకోవచ్చని పేర్కొంది. జనవరిలో జేఈఈ మెయిన్స్‌కు హాజరు కాని వారు ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. జేఈఈ మెయిన్స్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను ఏప్రిల్‌ 5, 7, 9, 11 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది. పరీక్షలు ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతలుగా నిర్వహిస్తామని స్పష్టం చేసింది.