Call Us On +91- 9246377055

News

మధ్యాహ్నం 1గంటకు తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు విడుదల కానున్నాయి. సచివాలయంలోని డీ బ‍్లాక్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేస్తారు. ఫలితాలతో పాటు ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ప్రకటిస్తారు. కాగా తెలంగాణ ఎంసెట్‌ - 2018 పరీక్షలు జేఎన్టీయూహెచ్‌ ఆధ్వర్యంలో మే 2 నుంచి 7వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని మొత్తం 87 కేంద్రాల్లో తొలిసారిగా కంప్యూటర్‌ ఆధారితంగా ఎంసెట్‌ పరీక్షలను నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం నుంచి 1,19,270 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 17,041 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి ఈ పరీక్షలకు 1,36,311 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలను www.sakshieducation.com  వెబ్‌సైట్‌ లో చూడవచ్చు.