Call Us On +91- 9246377055

News

డిగ్రీ ప్రవేశాలకు ప్రకటన జారీ నేటి నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు

డిగ్రీలో ప్రవేశాల కోసం ఉన్నత విద్యా మండలి బుధవారం సాయంత్రం ప్రకటన(దోస్త్‌)ను జారీ చేసింది. తెలంగాణ విశ్వవిద్యాలయం(తెవివి) పరిధిలో 20 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి.. నేటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని తెవివి దోస్త్‌ సమన్వయకర్త రవీందర్‌రెడ్డి తెలిపారు.

నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో కలిపి 11 ప్రభుత్వ, 3 ఎయిడెడ్‌, 5 సాంఘిక సంక్షేమ, 53 ప్రైవేటు డిగ్రీ కళాశాలలు) ఉన్నాయి. ఆయా కళాశాలల్లో కలిపి మొత్తం 20 వేలకు పైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సీట్ల సంఖ్యతో పాటు పూర్తి వివరాలు ఉన్నత విద్యా మండలి నుంచి ఇంకా రావల్సి ఉంది. అయితే డిగ్రీలో ప్రవేశాల కోసం రూ.100 చెల్లించి గురువారం నుంచే ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకొనే విద్యార్థుల ఆధార్‌ కార్డుకు వారి మొబైల్‌ నంబరు అనుసంధానమై ఉండాలి. ఆన్‌లైన్లో దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థి తన వెలిముద్ర నమోదు చేయగానే ఓటీపీ(వన్‌ టైం పాస్‌వర్డ్‌) వస్తుంది.. ఆ నంబరును విద్యార్థులు రహస్యంగా ఉంచుకోవాలి.. ఎట్టి పరిస్థితుల్లో ఎవరికీ చెప్పవద్దు. రెండు జిల్లాల్లో 10 ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో సహాయ(హెల్ప్‌లైన్‌ సెంటర్లు)కేంద్రాలు ఏర్పాటు చేశారు. ‘‘విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటే తప్పులు లేకుండా.. వివరాలు భద్రంగా ఉంటాయి... దోస్త్‌ ప్రక్రియ విద్యార్థుల పూర్తి స్వేచ్ఛకు సంబంధించింది.. ఎవరైనా భంగం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని’’ కన్వీనర్‌ రవీందర్‌రెడ్డి హెచ్చరించారు.

నోటిఫికేషన్‌ ముఖ్య తేదీలు.!
* ఈ నెల 23 తేదీ నుంచి జూన్‌ 3 వరకు దోస్త్‌ రిజిస్ట్రేషన్‌
* ఈ నెల 25 నుంచి జూన్‌ 3 వరకు వెబ్‌ ఆప్షన్ల ఎంపికకు అవకాశం
* జూన్‌ 10వ తేదీన మొదటి విడత సీట్ల కేటాయింపు
* జూన్‌ 10 నుంచి 15 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్‌
* జూన్‌ 20న రెండో విడత సీట్ల కేటాయింపు
* జూన్‌ 20 నుంచి 26 వరకు మూడో విడత రిజిస్ట్రేషన్‌
* జూన్‌ 29న మూడో విడత సీట్ల కేటాయింపు
* జులై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం