• +91 92463 77055
  • info@kabconsultants.com
  • 92463 77055

ScholarShips

ఐఐటీ ఢిల్లీలో పీహెచ్‌డీ, ఎంఎస్ ఫెలోషిప్ లు,స్కాలర్ షిప్ లు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐటీడీ) పీహెచ్‌డీ, ఎంఎస్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు
.......
పీహెచ్‌డీ ప్రోగ్రామ్

విభాగాలు: అప్లయిడ్ మెకానిక్స్, కెమికల్, బయోకెమికల్ అండ్ బయోటెక్నాలజీ, సివిల్, టెక్స్‌టైల్ టెక్నాలజీ, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్, మ్యాథ్‌మెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్
.
కాలపరిమితి: 4 సంవత్సరాలు
.
ఫెలోషిప్: బీఈ/ బీటెక్/ పీజీ అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాలు స్టయిపెండ్ కింద నెలకు రూ.16,000, తర్వాత రెండు సంవత్సరాలు నెలకు రూ.18,000 అందజేస్తారు. ఎంటెక్/ ఎంఈ/ ఎంబీబీఎస్ తత్సమాన అర్హతలున్న అభ్యర్థులకు మొదటి రెండు సంవత్సరాలు స్టయిపెండ్ కింద నెలకు రూ.18,000, తర్వాత రెండు సంవత్సరాలు నెలకు రూ.20,000 అందజేస్తారు
.
అర్హతలు: సంబంధిత విభాగాల్లో ఎంఈ/ ఎంటెక్/ ఎండీ డిగ్రీ ఉండాలి లేదా ఎంఎస్సీ/ ఎంబీఏ/ ఎంఏ/ ఎంబీబీఎస్/ బీఈ/ బీటెక్‌తో పాటు గేట్/ సీఎస్ఐఆర్/ యూజీసీ నెట్/ ఐసీఏఆర్/ ఐసీఎంఆర్/ డీఎస్టీ/ ఇన్‌స్పైర్‌లో జేఆర్ఆఎఫ్‌గా అర్హత సాధించాలి
.
ఎంఎస్ (రిసెర్చ్) ఫుల్ టైమ్/ పార్ట్‌టైమ్

విభాగాలు: అప్లయిడ్ మెకానిక్స్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
.
స్టయిపెండ్: ఎంపికైన ఫుల్ టైమ్ అభ్యర్థులకు రిసెర్చ్/ అసిస్టెంట్‌షిప్ కింద నెలకు రూ.8,000 అందజేస్తారు. స్పాన్సర్/ కన్సల్టెన్సీ ప్రాజెక్ట్‌లో పొల్గొనే అభ్యర్థులకు నెలకు రూ.3,000 అదనంగా చెల్లిస్తారు
.
కాలపరిమితి: ఫుల్ టైమ్ 2 సంవత్సరాలు, పార్ట్‌టైమ్ 3 సంవత్సరాలు
.
అర్హతలు: కంప్యూటర్ సైన్స్/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్/ ఆపరేషన్ రిసెర్చ్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ స్టాటిస్టిక్స్/ మ్యాథ్‌మెటిక్స్‌లో ఎంఎస్సీ/ ఎంసీఏతో పాటు గేట్‌లో అర్హత సాధించాలి
.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికచేస్తారు
.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: అక్టోబరు
10
చివరితేది: నవంబరు
10.

Rating
0 /5 (0   Votes)
Review

Post Reviews
Views (4448)