• +91 92463 77055
  • info@kabconsultants.com
  • 92463 77055

Success Stories

గూగుల్‌ మెచ్చిన తెలుగమ్మాయి

 వికారాబాద్‌, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): ఆ చదువుల తల్లికి లక్ష్మీ కటాక్షం లభించింది. ఆ మెరిక ప్రతిభను గూగుల్‌ మెచ్చింది. రూ. 1.2 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం కల్పించింది. ఆమే.. తెలంగాణ అమ్మాయి కుడుగుంట స్నేహారెడ్డి. ‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, నేచురల్‌ ల్యాంగ్వేజ్‌ అండర్‌స్టాండింగ్‌’ అనే అంశంపైౖ పరిశోధనలు చేస్తున్న గూగుల్‌ సంస్థ.. ఈ ప్రాజెక్టులో పనిచేసేందుకు ఇంటర్వ్యూలు నిర్వహించి దేశవ్యాప్తంగా ఐదుగురిని ఎంపిక చేసింది. వీరిలో స్నేహారెడ్డి ఒకరు. మిగతా నలుగురు పీహెచ్‌డీలు పూర్తి చేసినవారు కాగా.. స్నేహారెడ్డి ఒక్కరే బీటెక్‌తోనే ఈ అవకాశం అందిపుచ్చుకోవడం విశేషం. స్నేహారెడ్డి స్వస్థలం వికారాబాద్‌. హైదరాబాద్‌ ఐఐటీ (కంది-సంగారెడ్డి)లో ఆమె బీటెక్‌ పూర్తిచేశారు. తొలుత.. గూగుల్‌ సంస్థ నిర్వహించిన నాలుగు రౌండ్ల ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూను స్నేహారెడ్డి పూర్తిచేశారు. అయిదో రౌండ్‌ ఇంటర్వ్యూ ముఖాముఖీ జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో స్నేహ వేరే పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో స్నేహ ప్రతిభను గుర్తించిన గూగుల్‌ ప్రతినిధులు ఆమెకు ఐదో రౌండ్‌ పరీక్షనూ ఆన్‌లైన్‌లోనే నిర్వహించారు.

Rating
0 /5 (0   Votes)
Review

Post Reviews
Views (1377)